Indiramma Houses | ఏడాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ టవర్స్​ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | హైదరాబాద్ (Hyderabad)​ నగరం పరిధిలో ఇందిరమ్మ టవర్స్​ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  (Ponguleti) తెలిపారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.

నగరంలో భూముల విలువ రూ.వందల కోట్లు ఉన్నా.. పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో నగరానికి దూరంగా డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు కట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ టవర్స్​ నిర్మిస్తోందన్నారు. పేదల ఉపాధి, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. వారు నివసిస్తున్న ప్రాంతం దగ్గరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఏడాది లోపు ఈ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించేలా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. త్వరలో రెండోవిడత దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.

Indiramma Houses | ఉచితంగా రిజిస్ట్రేషన్​

ఇందిరమ్మ టవర్స్‌ (Indiramma Towers)లో ఎంపికైన లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు ఇవ్వడమే కాదు, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని మంత్రి తెలిపారు. వారి కుటుంబ అవసరాలకు ఈ ఆస్తితో కావాల్సిన రుణాన్ని కూడ తీసుకోవచ్చన్నారు. బీఆర్​ఎస్ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్​ ఇళ్లను పూర్తి చేసి, సమీప ప్రాంతాల్లోని అర్హులకు అందిస్తామని తెలిపారు.

దీనిని కూడా చదవండి : Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *