అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Poverty Eradication | తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. 2033 నాటికి దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై భట్టి విక్రమార్క గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (TSDPS)ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు.
Poverty Eradication | నిపుణుల సేవలు వినియోగించుకుంటాం
ప్రభుత్వ సంస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు నిపుణులు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇంట్లో నోట్ల కట్టలు