అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ (ACB) విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం అధికారులు ఆయన బినామీల ఇళ్లలో సోదాలు చేశారు.
భీమ్‌రెడ్డి డీజీపీ కార్యాలయం పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. దీంతో జూలై 2న 16 చోట్ల దాడులు నిర్వహించి, సుమారు రూ. 300 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను వెలికి తీశారు. ఇందులో విలాసవంతమైన విల్లా, ఫ్లాట్లు, 50 ఎకరాలకు పైగా భూమి, బంగారం, నగదు ఉన్నాయి. అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకొని సైతం విచారించారు. భీమ్‌రెడ్డి బినామీల ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో తాజాగా సోదాలు చేపట్టారు.
DSP Bheem Reddy | 10 చోట్ల సోదాలు
నిందితుడైన అధికారితో ఆర్థిక, ఇతర లావాదేవీలు కలిగి ఉన్న అనుమానిత బినామీల నివాసాలతో సహా, హైదరాబాద్ (Hyderabad), జహీరాబాద్ పరిధిలోని 10 వేర్వేరు ప్రదేశాలలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. బినామీ ఆస్తులకు సంబంధించిన అనేక పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బొమ్మ వెంకటేష్ నివాసంలో రూ. 1.35 కోట్ల నగదు లభ్యమైంది. అంతేగాకుండా విదేశీ కరెన్సీ, సుమారు 14 లీటర్ల విదేశీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిని కూడా చదవండి : Harish Rao Defamation Case | క్షుద్రపూజల ఆరోపణల కేసు.. కోర్టుకు హాజరైన హరీశ్ రావు