22A Prohibited List | 22ఏ బాధితులకు ఊరట.. ప్రభుత్వం కీలక ప్రకటన

22ఏ బాధితులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : 22A Prohibited List | రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్లాట్లు సైతం ఆ జాబితాలో ఉండటంతో వాటిని అమ్ముకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

జీహెచ్‌ఎంసీ (GHMC), హెచ్‌ఎండీఏ (HMDA), డీటీసీపీ (DTCP) ప్లానింగ్ అథారిటీల అనుమతులు ఉన్న భవనాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్​కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తామని స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది బాధితులకు ఊరట లభించనుంది. కాగా హైదరాబాద్​ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములతో పాటు ఇళ్లు, ప్లాట్లు సైతం 22ఏ జాబితాలో చేర్చారు. దీంతో వాటిని రిజిస్ట్రేషన్​ చేసే ఆప్షన్​ లేకుండా పోయింది.

22A Prohibited List | ప్రజల నిరసనతో..

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని అనేక ఇళ్లు, ప్లాట్లు సైతం 22 ఏలో చేరాయి. ఆయా ఆస్తులను అమ్ముకోవడానికి, రుణాలు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో బాధితులు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇంటిని నిషేధిత జాబితాలో పెడితే ఎలా అని వాపోయారు. అయితే దరఖాస్తులు చేసుకుంటే సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదే అదునుగా పలువురు అధికారులు వసూళ్ల వేటకు దిగారు. భూములను నిషేధిత జాబితాలో తీయడానికి లంచాలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం 22ఏలో ఉన్న అనుమతులు తీసుకొని వేసిన లే అవుట్​ ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్​కు ఓకే చెప్పడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Poverty Eradication | 2030 నాటికి పేదరిక నిర్మూలన : డిప్యూటీ సీఎం భట్టి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.