అక్షరటుడే, వెబ్డెస్క్ : Vana Mahotsavam 2026 | రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో జరుగుతున్న “వనమహోత్సవం – 2026” గ్రాండ్ లాంచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు . హరితహారం స్ఫూర్తితో అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గుర్రంగూడ అర్బన్ పార్క్‌లో నాగలింగం మొక్కను నాటి వనమహోత్సవం–2026 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సి. సువర్ణ పాల్గొన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వనమహోత్సవం–2026 కార్యక్రమాలకు ఈ వేడుక నాంది పలికింది.
Vana Mahotsavam 2026 | రాష్ట్రవ్యాప్తంగా..
రాష్ట్రవ్యాప్తంగా నేడు వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నారు. హరిత తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. హరితహారం పేరిట గతంలో అమలు చేసిన పథకాన్ని కాంగ్రెస్ వన మహోత్సవంగా మార్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయా శాఖలకు లక్ష్యం విధించింది.
గుర్రంగూడ అర్బన్ పార్క్ లో నాగలింగం మొక్కనాటి వనమహోత్సవం 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు, మంత్రి కొండా సురేఖ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు..పాల్గొన్న అటవీ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సీ సువర్ణ.@revanth_anumula… pic.twitter.com/3Ry9BeSw2K
— IPRDepartment (@IPRTelangana) June 18, 2026
దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్డేట్.. 30న నిధులు విడుదల