Minor Biker | బాలుడు నడిపిన బైక్ ఢీకొని ఒకరి దుర్మరణం..

మైనర్​ డ్రైవింగ్​తో ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Minor Biker | ఇటీవల పదో తరగతిలో కొడుకు పాసయ్యాడని ఆ తండ్రి సంతోషంలో బైక్​ కొనిచ్చాడు. ఈ బైక్​తో వేగంగా వెళ్లిన మైనర్​ ఒకరి ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

Minor Biker | రూ.4 లక్షల బైక్​ గిఫ్ట్​గా..

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లింగంపేట(Lingampet) మండలంలోని మోతె గ్రామానికి చెందిన పులగం వెంకటస్వామి(39) ఓ కంపెనీలో రికవరీ ఏజెంట్​గా పని చేస్తున్నాడు. పనిలో భాగంగా బైక్​పై కామారెడ్డి నుంచి అశోక్ నగర్ కాలనీ మీదుగా ఇల్చిపూర్ వెళ్తున్నాడు. కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇల్చిపూర్ వైపు నుంచి కామారెడ్డి వైపు బైక్​పై మితిమీరిన వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న వెంకటస్వామి బైక్​ను బలంగా ఢీకొన్నాడు.

ఈ ఘటనలో వెంకటస్వామి రోడ్డుపై పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు. బాలుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident |

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *