Secunderabad Drugs Seizure | సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో భారీగా డ్రగ్స్​ స్వాధీనం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Secunderabad Drugs Seizure | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station)లో ఇద్దరు మహిళల నుంచి రూ.11.4 కోట్ల విలువైన 11.4 కిలోల యాంఫెటమైన్​ను డీఆర్ఐ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగులలోని బెడ్‌షీట్ల మడతలలో దాచి ఉంచిన డ్రగ్స్​ సీజ్​ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పై చేపట్టిన ఒక భారీ ఆపరేషన్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పక్కా సమాచారం మేరకు రైల్వే స్టేషన్​లో దాడులు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను అధికారులు అడ్డగించారు. వారు తీసుకువెళ్తున్న రెండు ట్రాలీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, తెల్లటి స్ఫటికాకార పదార్థం ఉన్న 10 పారదర్శక ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. డ్రగ్స్​ తరలిస్తున్న మహిళలు వాటిని గుర్తు పట్టకుండా.. నల్ల పాలిథీన్‌లో చుట్టి, డిజైనర్ పేపర్‌తో కప్పి, ట్రాలీ బ్యాగులలోని పరుపుల షీట్ల మడతలలో దాచారు.

Secunderabad Drugs Seizure | రూ.11 కోట్ల విలువ

స్వాధీనం చేసుకున్న ఆ పదార్థాన్ని ఫీల్డ్ డ్రగ్ డిటెక్షన్ కిట్ ఉపయోగించి పరీక్షించారు. అది యాంఫెటమైన్ అని, దీనిని సాధారణంగా క్రిస్టల్ మెత్ అని పిలుస్తారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 11,400 గ్రాముల ఈ నిషేధిత సరుకు మార్కెట్ విలువ సుమారు రూ.11.4 కోట్లుగా అంచనా వేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. ఈ డ్రగ్స్​ను విదేశాలకు తరలించేందుకు నిందితులు యత్నించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి : Constable Harassment | కానిస్టేబుల్​ వేధింపులతో యువకుడి సూసైడ్​.. వెలుగులోకి సెల్ఫీ వీడియో..

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *