అక్షరటుడే, ఇందూరు: Congress Party Building | నగరంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగనుంది. ముఖ్యఅతిథిగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, అతిథిగా మంత్రి సీతక్క హాజరు కానున్నారు.
Congress Party Building | పాత పార్టీ ఆఫీస్ ఎదురుగానే..
నగరంలోని రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలో కొన్నేళ్లుగా పార్టీ కార్యాలయం (Party Office) కొనసాగుతోంది. అయితే అద్దె భవనంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం ఇబ్బందిగా మారింది. దీంతో కాంగ్రెస్ భవన్ (Congress Bhavan) ఎదురుగానే ఉన్న స్థలంలో ప్రస్తుతం కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి..: Seethakka Kamareddy tour | నేడు కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటన

