అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Stock Market Rally | “ఈక్విటీ పన్నుల విధానంపై పెట్టుబడిదారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను తొలగింపుపై వాటాదారుల అభిప్రాయాలను వినడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉంది” అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఎల్టీసీజీ, ఎస్ టీటీ లపై ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చారు. హెచ్‌సీఎల్ టెక్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడంతో ఐటీ షేర్లు పరుగులు తీశాయి. దీంతోపాటు ఫారెక్స్ డెరివేటివ్‌లలో ట్రేడింగ్‌ను పరిమితం చేయడం, ట్రేడింగ్ వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్బీఐ విధించిన ఆంక్షలతో రూపాయి విలువ వరుసగా రెండో సెషన్లోనూ బలపడడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పాజిటివ్‌గా మార్చాయి. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో విలువ ఆధారిత కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి.
Indian Stock Market Rally | ఫ్లాట్ గా ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 37 పాయింట్ల స్వల్ప గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడితో 248 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 1,342 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమై 75 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కష్టాలనుంచి కోలుకుని 433 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,109 పాయింట్ల లాభంతో 73,033 వద్ద, నిఫ్టీ 358 పాయింట్ల లాభంతో 22,721 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,518 కంపెనీలు లాభపడగా 1,834 స్టాక్స్ నష్టపోయాయి. 239 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 118 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 171 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 27 కంపెనీలు లాభాలతో, 3 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ 8.28 శాతం, టీసీఎస్ 6.59 శాతం, టెక్ మహీంద్రా 4.90 శాతం, ఇన్ఫోసిస్ 4.44 శాతం, హెచ్‌యూఎల్ 2.94 శాతం పెరిగాయి.
Losers : కొటక్ బ్యాంక్ 0.90 శాతం, ఎటర్నల్ 0.60 శాతం, మారుతి 0.60 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Indian Stock Market | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్లు.. లాభాల్లో ప్రధాన సూచీలు