Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Forecast | తెలంగాణ (Telangana) రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సైతం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వానలు లేక అల్లాడుతున్న రైతాంగాన్ని వరుణుడు కరుణించాడు. రెండు రోజులుగా వర్షాలు పడుతుండటంతో పంటలతో పాటు అన్నదాతలకు ప్రాణం వచ్చింది. నేడు ఆదిలాబాద్​, నిర్మల్​, అసిఫాబాద్​, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్​, మహబూబాబాద్​, హన్మకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్లా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana Rain Forecast | మోస్తరు వర్షాలు

మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్​నగర్​, గద్వాల్​ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో సైతం సాయంత్రం, రాత్రిపూట జల్లులు కురుస్తాయి.

Telangana Rain Forecast | రైతుల హర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్న క్రమంలో భారీ వర్షం పడటంతో ఎంతో మేలు చేశాయని పేర్కొంటునారు. ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్​లో అత్యధికంగా 101.5 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.

ఇది కూడా చదవండి..: Armoor Political Tension | ఆర్మూర్​లో హైటెన్షన్.. వినయ్​ రెడ్డి హౌస్​ అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *