అక్షరటుడే, వెబ్డెస్క్: Podu Farmers Protest | ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District) జైనూర్ మండలంలోని పులస గ్రామ శివారులో అటవీ భూమిని జేసీబీతో చదును చేసేందుకు ఫారెస్ట్ అధికారులు ఉదయం వెళ్లారు. అయితే అక్కడ భూములను సాగు చేసుకుంటున్న రైతులు అధికారులను అడ్డుకున్నారు. తమను అరెస్ట్ చేసినా, చంపినా భూములను వదులుకోము అంటూ ఆందోళన చేశారు.దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Podu Farmers Protest | రోడ్డున పడుతాం
తాతముత్తాతల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, హక్కు పత్రాలు సైతం ఉన్నాయని రైతులు తెలిపారు. కానీ ఇప్పుడు వచ్చి మా భూములు లాక్కుంటే మేము మా పిల్లలు ఎట్లా బతకాలని ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించారు. ఉన్న ఈ భూములను లాక్కుంటే ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Excise Transfers | ఎక్సైజ్ అధికారుల బదిలీ.. నిజామాబాద్ డీసీగా శ్రీధర్