Kalvakuntla Kavitha | సక్సెస్​కు షార్ట్​కట్ లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు

సక్సెస్​కు షార్ట్ కట్ లేదని, హార్డ్ వర్క్ ద్వారానే సక్సెస్ అవుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | సక్సెస్​కు షార్ట్ కట్ లేదని, హార్డ్ వర్క్ ద్వారానే సక్సెస్ అవుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్​లో నిర్వహించిన జాబ్ మేళాలో ఆమె పాల్గొన్నారు.

దాదాపు 150 కంపెనీలతో 2 వేల ఉద్యోగాలిచ్చే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడాన్ని కవిత అభినందించారు. అర్హత ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలను కోరారు. ఫస్ట్ జాబ్ అనేది చాలా ముఖ్యమని కవిత తెలిపారు.

Kalvakuntla Kavitha | అబద్దాలు చెప్పొద్దు

job mela

ఇంటర్వ్యూలో అబద్దాలు చెబితే జాబ్ వస్తుందని అనుకోవద్దని సూచించారు. మీకు ఏమీ వచ్చో అదే చెప్పండి. నిజం చెప్పండి. అవసరమైతే టైమ్ ఇస్తే నేర్చుకుంటాను అని చెప్పాలని సూచించారు. ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలన్న ఫ్రీగా యూట్యూబ్ లో నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఫార్మాల్ కాలేజీలలో ఇప్పుడు 70 శాతం అమ్మాయిలే చేరుతున్నారని కవిత అన్నారు. కచ్చితంగా జాబ్ వస్తుందన్న విశ్వాసంతో ఉండాలని యువతకు సూచించారు. ఒకవేళ జాబ్ రాకపోయినా సరే మళ్లీ ప్రయత్నించాలన్నారు.

దీనిని కూడా చదవండి : Commercial LPG Price | వ్యాపారులకు ఊరట.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *