ED Raids Hyderabad | హైదరాబాద్​లో ఈడీ సోదాల కలకలం

ఈడీ అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్, విశాఖపట్నంలో సోదాలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: ED Raids Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. రూ.3 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్, విశాఖపట్నంలో సోదాలు చేశారు.

రూ.3 వేల కోట్ల చిట్​ ఫండ్​ స్కామ్​పై ఈడీ దూకుడు పెంచింది. వెల్ఫేర్ గ్రూప్ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ఇంటితో పాటు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. బీహార్​కు చెందిన అధికారులు ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు జరుపుతున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఛైర్మన్‌గా అవకతవకలకు పాల్పడినట్లు విజయప్రసాద్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా ఆయన ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.

ED Raids Hyderabad | బీహార్​లో కేసులు

వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్​ పెట్టింది. ఈ కంపెనీపై బీహార్​లో సైతం కేసులు నమోదు అయ్యాయి. దీంతో స్థానిక అధికారులతో పాటు బీహార్​ నుంచి ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేయడం గమనార్హం. విజయ ప్రసాద్​ చిట్‌ఫండ్స్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను దారి మళ్లించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Santosh Nagar Steel Bridge |  ప్రారంభానికి సిద్ధంగా స్టీల్​ బ్రిడ్జి.. తప్పనున్న ట్రాఫిక్​ కష్టాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *