అక్షరటుడే, వెబ్‌డెస్క్: Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది ఓల్డ్ సిటీకి మరో ఆధునిక మౌలిక సదుపాయాల ఆభరణంగా నిలవనుంది.
Santosh Nagar Steel Bridge | 2.58 కి.మీ పొడవు..
ఈ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) త్వరలో ప్రారంభించనున్నారు. 2.58 కి.మీ పొడవైన స్టీల్ ఫ్లైఓవర్‌ను నాలుగు లేన్ల కారిడార్‌గా నిర్మించారు. ప్రతిరోజూ 1.5 లక్షలకు పైగా వాహనాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. సంతోష్‌నగర్ – సైదాబాద్ మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు సమయం ఆదా కానుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి మరియు హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Water Supply | తాగునీటి సరఫరాలో అంతరాయం