GGH Newborn Body | జీజీహెచ్​లో దారుణం.. ఆస్పత్రి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం

జీజీహెచ్​ ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం అయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: GGH Newborn Body | జీజీహెచ్​లో దారుణం చోటు చేసుకుంది. నిత్యం వైద్యుల పర్యవేక్షణ, సెక్యూరిటీ గార్డులు నిఘాలో ఉండే ఆస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో శిశువు మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది..

GGH Newborn Body | ఎవరై ఉంటారు..?

జీజీహెచ్​ ఆస్పత్రి (GGH Hospital)కి నిత్యం వేల సంఖ్యలో రోగులు, వారికి సంబంధించిన వారు వస్తూపోతూ ఉంటారు. రోజూ 1500లకు పైగా ఓపీ ఉంటోంది. అలాగే గర్భిణుల కోసం ప్రత్యేక వార్డు ఉంది. నిత్యం సెక్యూరిటీ సిబ్బంది సైతం పర్యవేక్షిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్పత్రిలో డెలివరీ అయిన ఓ నవజాత శిశువు మృతదేహం డ్రైనేజీలో కనిపించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఆస్పత్రికి వచ్చే ప్రతి గర్భిణి వివరాలు రికార్డుల్లో ఉంటాయి. అలాగే నవజాత శిశువులు జన్మించిన తర్వాత వారి వివరాలు సైతం నమోదు చేస్తారు. అయినప్పటికీ వైద్యసిబ్బందికి, అధికారులకు సమాచారం లేకుండా నవజాత శిశువు మృతదేహం బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

GGH Newborn Body | కొత్త భవనంలో..

GGH Newborn Body

జీజీహెచ్​లో గతంలో గైనిక్​, పిడియాట్రిక్​కు సంబంధించి విభాగాలు ఉండేవి. అక్కడే డెలివరీలు, పరీక్షలు జరుగుతుండేవి. అయితే బస్టాండ్​కు ఎదురుగా నిర్మించిన కొత్త భవనానికి ఈ రెండు విభాగాలను మార్చేశారు. సుమారు 12ఏళ్ల వరకు చిన్నారులకు చికిత్సలు, డెలివరీలు, బాలింతలకు సంబంధించిన పరీక్షలన్నీ ఈ కొత్త భవనంలోనే జరుగుతున్నాయి. అయితే డెలివరీ కొత్త భవనంలో జరుగుతుండగా.. జీజీహెచ్​ ఆవరణలో నవజాత శిశువు మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో 60 మంది వరకు సెక్యూరిటీ సిబ్బంది నిత్యం ఆయా విభాగాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ సందర్భంగా వన్​ టౌన్​ పోలీసులు మాట్లాడుతూ.. నవజాత శిశువు మృతదేహం వివరాలు తెలిస్తే 8712659714లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad chain snatching | నిజామాబాద్‌లో చైన్ స్నాచింగ్..నిందితుల కోసం పోలీసుల గాలింపు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *