HYDRA Ranganath High Court stay | హైకోర్టు కీలక నిర్ణయం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు!

ఈ కేసు విచారణ సందర్భంలో ఆ స్టే కాల పరిమితిని 2027 జనవరి 20 వరకు పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: HYDRA Ranganath High Court stay | హైదరాబాద్ Hyderabad డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్న స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ మరింత కాలం పొడిగించింది. వచ్చే ఏడాది (2027) జనవరి 20వ తేదీ వరకు ఈ స్టే ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

HYDRA Ranganath High Court stay | వివాదం ఏంటి?

కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారనే అభియోగాలపై రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తొలగించాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో అపీల్ దాఖలు చేశారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంలో ఆ స్టే కాల పరిమితిని 2027 జనవరి 20 వరకు పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

HYDRA Ranganath High Court stay | హైడ్రాకు తాత్కాలిక ఉపశమనం

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణలో హైడ్రా కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిషనర్ రంగనాథ్ తొలగింపుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే పొడిగించడంతో ఆయన పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *