West Bengal Corruption | బస్సు డ్రైవర్ ఇంట్లో కోట్లాది నగదు.. 15 కిలోల బంగారం లభ్యం

పశ్చిమ బెంగాల్‌లో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: West Bengal Corruption | పశ్చిమ బెంగాల్‌లో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఇసుక, క్వారీ మాఫియాపై దర్యాప్తులో భాగంగా ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంటిపై పోలీసులు జరిపిన సోదాల్లో అక్రమ సంపద బయటపడింది. ఇప్పటివరకు దాదాపు రూ.5.5 కోట్ల నగదుతో పాటు 15 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

West Bengal Corruption | సోదాల వివరాలు..

బీర్‌భూమ్ జిల్లాకు చెందిన మీనా మండల్ గతంలో బెంగాల్ ప్రభుత్వంలో బస్సు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేసి క్వారీ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. స్థానికంగా ఇసుక, క్వారీ మాఫియా డాన్‌గా పేరున్న తులు మండల్‌కు మీనా మండల్ సమీప బంధువు కావడం గమనార్హం. పక్కా సమాచారంతో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా.. భారీగా నగదు, బంగారం లభించాయి. అలాగే మీనా పేరు మీద మరిన్ని పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించి, ఈ సంపద మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు. బీర్‌భూమ్‌ జిల్లాలో సుమారు 250 అక్రమ క్వారీలు నడుస్తుండగా, అవన్నీ తులు మండల్ కనుసన్నల్లోనే సాగుతున్నట్లు పోలీసులు తేల్చారు.

West Bengal Corruption | సువేందు అధికారి స్పందన..

ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ప్రజల సొమ్మును దోచుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ పోలీసులు, అధికారులను అభినందించారు.

ఇది కూడా చదవండి:  Aapada Mithra Volunteers | విపత్తుల సమయంలో సమర్థవంతంగా సేవలు అందించాలి: అదనపు కలెక్టర్ భుజంగరావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *