US Strikes on Iran | ఇరాన్​పై మరోసారి అమెరికా దాడులు

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ సెంటర్‌, డ్రోన్‌ లాంచ్‌ సైట్లపై క్షిపణులను ప్రయోగించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Strikes on Iran | ఇరాన్‌పై మరోసారి అమెరికా బాంబు దాడులు చేసింది. ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ సెంటర్‌, డ్రోన్‌ లాంచ్‌ సైట్లు, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌పై యూఎస్​ క్షిపణులతో విరుచుకుపడింది. మరోవైపు కువైట్‌లోని US స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది.

ఇరాన్​లోని సిరిక్, బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం, షిరాజ్, మరియు ఇస్ఫహాన్‌లలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకలపై దాడి చేయడానికి ఇరాన్ ఉపయోగించే సైనిక సామర్థ్యాలను మరింతగా బలహీనపరిచేందుకే ఈ దాడులు జరిగాయని పేర్కొంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఈ ఆపరేషన్‌ను ప్రకటించింది. ప్రతిచర్యగా కువైట్‌పై దాడులు జరిపినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటనలు జారీ చేసింది.

US Strikes on Iran | నౌకలపై దాడులు

ఇరాన్​ దాడుల్లో అమెరికా హిమార్స్ క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, శాటిలైట్ రిసీవర్లు, ఒక టెలికమ్యూనికేషన్స్ కేంద్రం, MQ-9 డ్రోన్ హ్యాంగర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. బహ్రెయిన్‌లో ఒక రాడార్‌ను, అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఐఆర్​జీసీ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున హోర్ముజ్ జలసంధిలోని అసురక్షిత దక్షిణ మార్గం మీదుగా వెళ్ళడానికి ప్రయత్నించిన మరో రెండు చమురు ట్యాంకర్లు పేలుళ్లకు గురయ్యాయని పేర్కొంది. మరోవైపు నౌకలపై దాడులు చేస్తే ఇరాన్​పై మరింత భారీ ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్​ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Saudi Naval Blockade | యెమెన్ సంచలన ప్రకటన!..సౌదీపై నౌకాదళ దిగ్బంధం !!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *