Bab al-Mandeb Strait | బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసివేస్తాం.. హౌతీల సంచలన ప్రకటన

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bab al-Mandeb Strait | హర్ముజ్​ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో ఇప్పటికే ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలకమైన బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసి వేస్తామని యెమెన్​లోని హౌతీలు ప్రకటించారు.

యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు లేని హౌతీ ప్రభుత్వ ఉప విదేశాంగ మంత్రి హుస్సేన్ అల్-ఎజ్జీ (Hussein Al-Ezzi) అమెరికాకు వార్నింగ్​ ఇచ్చారు. శాంతికి ఆటంకం కలిగించే అన్ని పద్ధతులు, విధానాలను అంతం చేయకపోతే వ్యూహాత్మకమైన బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసి వేస్తామన్నారు. ఒకవేళ సనా బాబ్ అల్-మండేబ్‌ (Bab al-Mandeb)ను మూసివేయాలని నిర్ణయించుకుంటే, దానిని ఎవరు తెరవలేరన్నారు. ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే చర్యలను ట్రంప్‌ ఆపేయాలని హూతీలు హెచ్చరించారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కి మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు సైతం సూచించారు.

Bab al-Mandeb Strait

Bab al-Mandeb Strait | కీలకమైన మార్గం

బాబ్ అల్-మండేబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలుపుతుంది. ఇది సూయజ్ కాలువ వైపు సముద్ర రవాణాను మళ్ళించే ఒక కీలకమైన నౌకా రవాణా మార్గం. అత్యంత ఇరుకైన ప్రదేశంలో 29 కిలోమీటర్ల (18 మైళ్ల) వెడల్పుతో ఉంటుంది. దీంతో లోపలికి, బయటికి వెళ్లే సరుకుల రవాణా రెండు మార్గాలకే పరిమితమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సరుకుల రవాణాకు, ముఖ్యంగా గల్ఫ్ నుంచి మధ్యధరా సముద్రానికి ముడి చమురు, ఇతర ఇంధనాల రవాణాకు, అలాగే రష్యా చమురుతో సహా ఆసియాకు వెళ్లే సరుకుల రవాణాకు అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటి. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుందని సమచారం.

ఇది కూడా చదవండి..: Iran Attack Indian Ship | క్లియరెన్స్ ఇచ్చి కాల్పులు జరుపుతున్నారు’.. ఇరాన్ దాడి సమయంలో భారతీయ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *