Telangana Heavy Rain | నేడు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో రానున్న 24 గంటలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heavy Rain | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరుసగా మూడో రోజు విస్తారంగా వర్షాలు పడుతాయని పేర్కొన్నారు.

వానాకాలం సీజన్​ ప్రారంభం అయి 50 రోజులు దాటి పోయింది. అయితే మూడు రోజులుగా మాత్రమే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి ముసురు వర్షం పడింది. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

Telangana Heavy Rain | 24 గంటల పాటు

రానున్న 24 గంటల పాటు తెలంగాణకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డిలో విస్తృతంగా ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెంలో మోస్తరు వానలు పడుతాయి.

Telangana Heavy Rain | వర్షపాతం వివరాలు

గత 24 గంటల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో అత్యధికంగా 124.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. జాన్కపూర్​123 మి.మీ, తాండూర్​లో 120.3, దేవులవాడ 113.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్​లో 109.5 మి.మీ, ములుగు జిల్లా వెంకటాపూర్​లో​ 104.3 వర్షపాతం నమోదు అయింది.

ఇది కూడా చదవండి..: GHMC Elections Petition | డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ నిలిపివేయాలి..జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *