Delhi Incident | ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Delhi Incident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నాంగ్లోయ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఘటనకు ఉపయోగించిన బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు పితంపుర మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ, మంగోల్‌పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. మే 11 రాత్రి పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా సరస్వతి విహార్ (Saraswati Vihar) వద్ద ఆగి ఉన్న ఓ స్లీపర్ బస్సు వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని సమయం ఎంత అని అడిగింది.

Delhi Incident | ప్రైవేట్ బ‌స్సులో అత్యాచారం..

అయితే అదే సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాగినట్లు తెలుస్తోంది. అనంతరం బస్సును రాణి బాగ్ నుంచి నాంగ్లోయ్ వైపు తీసుకెళ్లి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలు వివాహిత కాగా ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి, రాణి బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

Delhi Incident |ఢిల్లీలోని జ‌న‌క్‌పురిలో మరో దారుణ ఘటన

ఇదిలా ఉండగా, ఇటీవలే పశ్చిమ ఢిల్లీలోని జ‌న‌క్‌పురిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడేళ్ల చిన్నారిపై 57 ఏళ్ల పాఠశాల సిబ్బంది అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కూడా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తాజా ఘటనలతో ఢిల్లీలో మహిళలు, చిన్నారుల భద్రతపై మళ్లీ తీవ్ర చర్చ మొదలైంది.

ఇది కూడా చదవండి..: Heavy Rains in UP | ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం.. భారీ వర్షాలు, పిడుగులతో 43 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *