అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi Police Notices | దేశ రాజధానిలో విద్యార్థుల నిరసనల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఎక్స్ ( ట్విట్టర్) ఖాతాదారులకు దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Delhi Police Notices | పోలీసులు ప్రత్యేక నిఘా ..
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, చట్టాలను ఉల్లంఘించే విధంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వాటిని క్షుణ్ణంగా సమీక్షించిన తర్వతే ఈ చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, పాకిస్థాన్ ప్రమేయం ఉన్న సుమారు 400 సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశంలో తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు దిల్లీ పోలీసులు ఇదివరకే గుర్తించిన విషయం తెలిసిందే.
Delhi Police Notices | విద్యార్థుల సంయుక్త కూటమి ఏర్పాటు..
మరోవైపు, కేంద్ర ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చేందుకు రైతులు, విద్యార్థులు, యువతతో కలిసి ఒక సంయుక్త కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా రైతు నాయకుడు రాకేశ్ టికాయత్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు భేటీ అయ్యారు. కేంద్రం తన మాట తప్పుతోందని సీజేపీ ఆరోపించింది. రానున్న రోజుల్లో ఈ గ్రూప్‌లన్నీ కలిసి మోదీ ప్రభుత్వంపై మరింత తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తాయని సీజేపీ ప్రతినిధి అశుతోశ్ రంకా వెల్లడించారు.
Delhi Police has issued notices to several X (formerly Twitter) handles for using abusive language, including against Prime Minister Narendra Modi and security forces. The notices have been sent to individuals, including a woman who allegedly used highly derogatory language… pic.twitter.com/zt4nibPsX1
— IANS (@ians_india) July 29, 2026
ఇది కూడా చదవండి: Pooja Precision IPO | ఊరిస్తున్న ఎస్ఎంఈ ఐపీవో.. తొలిరోజే 90 శాతం లాభాలు వచ్చే అవకాశం!