PMAY Rural Houses | రాష్ట్రానికి రెండు లక్షలు ఇళ్లు కేటాయించిన కేంద్రం.. సీఎం కృతజ్ఞతలు

కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​తో సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PMAY Rural Houses | హైదరాబాద్​ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ను సీఎం రేవంత్​రెడ్డి  శుక్రవారం ఉదయం కలిశారు. మాదాపూర్​లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయనను సన్మానించారు.

ప్రధాన్​ మంత్రి ఆవాస్​ యోజన గ్రామీణ్​ పథకంలో భాగంగా రాష్ట్రానికి మొదటి విడతలో 2 లక్షల ఇళ్లను కేటాయించారు. దీనిపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపారు. 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని జులైలో సీఎం కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా రెండు లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని శివరాజ్​ సింగ్​ చౌహాన్​ను సీఎం కోరారు.

PMAY Rural Houses | సహకారం అందించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావంపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వ్యవసాయ రంగంలో ఎల్​నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Danam Nagender | ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు భయం : దానం నాగేందర్

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *