అక్షరటుడే వెబ్‌డెస్క్: BMW Employee Gifts | వాతావరణ మార్పుల వల్ల చలికాలంలో స్కూటర్లపై ఆఫీసులకు వస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులను చూసి చైనాకు ( China )చెందిన ఒక రెస్టారెంట్ యజమానురాలు అత్యంత అరుదైన, అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన రెస్టారెంట్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్ ఎంప్లాయీస్‌కు ఏకంగా రూ. 43 లక్షల విలువైన బ్రాండ్ న్యూ ‘బీఎండబ్ల్యూ’ (BMW) కార్లను బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన రెస్టారెంట్ అధినేత్రి మా యాన్లీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.
BMW Employee Gifts| ఆఫీస్ మీటింగ్ పేరుతో..
కార్ల పంపిణీకి సంబంధించి ఆమె ప్లాన్ చేసిన విధానం కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబరు 24న సాధారణ ఆఫీస్ మీటింగ్ పేరుతో కొందరు ఉద్యోగులను ఆమె నేరుగా బీఎండబ్ల్యూ షోరూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక, ‘మీ కష్టానికి ప్రతిఫలంగా ఈ కార్లను మీకు గిఫ్ట్‌గా ఇవ్వడానికే ఇక్కడికి తీసుకొచ్చా’ అని చెప్పడంతో ఆ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
BMW Employee Gifts | ఉద్యోగుల కృషి వల్లే..
ఈ వినూత్న కానుకపై యజమానురాలు మా యాన్లీ స్పందిస్తూ.. తీవ్రమైన చలిలో ఓ ఉద్యోగి స్కూటర్‌పై విధులకు రావడం, ఆ చలికి అతడి ముఖం ఎర్రగా మారిపోవడం చూసి తాను చలించిపోయానని తెలిపారు. ‘నేను కారులో ప్రశాంతంగా, సౌకర్యవంతంగా వస్తున్నప్పుడు నా కోసం రాత్రింబవళ్లు కష్టపడే ఉద్యోగులు చలిలో ఎందుకు ఇబ్బంది పడాలి?’ అనే ఆలోచన తనలో వచ్చిందని చెప్పారు. సంస్థ సాధించే ఏ విజయమైనా ఉద్యోగుల కృషి వల్లే సాధ్యమవుతుందని, ఆ విజయాన్ని వారితో పంచుకోవడంలోనే అసలైన తృప్తి ఉందని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రూ. 43 లక్షల విలువైన కార్లను బహుమతిగా ఇచ్చిన ఈ బాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇది కూడా చదవండి: 12 Hours Free Power | 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి