Telangana APP Results | APP ఫలితాలు వచ్చేశాయ్.. ఓఎంఆర్ షీట్లు, ఫైనల్ కీ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) బోర్డు ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు (IPS) అధికారికంగా విడుదల చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana APP Results | తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) బోర్డు ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు (IPS) అధికారికంగా విడుదల చేశారు. 2025 ఆగస్టు 15న వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా, అదే ఏడాది డిసెంబర్ 14న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 4 కేంద్రాల్లో ఈ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) నిర్వహించిన సంగతి తెలిసిందే.

Telangana APP Results | వెబ్‌సైట్‌లో అందుబాటులో..

అభ్యర్థుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను నిపుణుల ద్వారా పరిష్కరించిన అనంతరం బోర్డు ఫైనల్ కీని సిద్ధం చేసింది. రాత పరీక్ష ఫలితాలు, ఫైనల్ కీతో పాటు పేపర్-1 ఓఎంఆర్ (OMR) షీట్ల స్కాన్డ్ కాపీలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల ద్వారా లాగిన్ అయి తమ మార్కులు, ఓఎంఆర్ షీట్లను తనిఖీ చేసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్‌ను కూడా వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Telangana APP Results | సర్టిఫికేట్ల పరిశీలన..

రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈనెల 17న సర్టిఫికేట్ల పరిశీలన (Certificate Verification) నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాజరుకావాల్సిన సమయం, వేదిక వివరాలు వారి ఇంటిమేషన్ లెటర్‌లో పొందుపరిచారు. అర్హత పొందిన అభ్యర్థులు నిర్దేశిత తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయానికి హాజరుకాని పక్షంలో, వారికి ఈ ఉద్యోగంపై ఆసక్తి లేనట్లుగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.

Telangana APP Results | సాంకేతిక సమస్యలు ..

లాగిన్ కావడం లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీ నుంచి అధికారిక సపోర్ట్ మెయిల్‌కు సందేశం పంపవచ్చు లేదా బోర్డు హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Education Hub | అటకెక్కిన ఎడ్యుకేషన్ హబ్.. కామారెడ్డిలో అందని ద్రాక్షగా ఉన్నత చదువులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *