Stock Market Close | స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 13 పాయింట్లు, నిఫ్టీ 24 పాయింట్లు పడిపోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Close | హార్ముజ్ జలసంధి గుండా ఇంధన సరఫరాకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.

దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయినా.. ఐటీ రంగ షేర్లతోపాటు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రాణించడంతో చివరికి ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Stock Market Close | ఫ్లాట్ గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 37 పాయింట్ల గ్యాప్ అప్ లో, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 76,656 నుంచి 77,231 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 23,952 నుంచి 24,143 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 76,944 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 24,055 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Close | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,760 కంపెనీలు లాభపడగా 2,563 స్టాక్స్ నష్టపోయాయి. 236 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 178 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 137 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్ లాభపడగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఐటీసీ 3.98 శాతం, హెచ్సీఎల్ టెక్ 3.21 శాతం, ఇన్ఫోసిస్ 2.44 శాతం, ఎయిర్‌టెల్ 2.30 శాతం, రిలయన్స్ 1.74 శాతం లాభపడ్డాయి.

Top Losers : మారుతి 4.16 శాతం, ఎస్బీఐ 2.51 శాతం, ఇండిగో 2.48 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.40 శాతం, ఎంఅండ్ ఎం 2.36 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Symbiotec Pharma IPO | ఫ్లాట్‌గా లిస్టయినా.. పైకి ఎగబాకిన ఫార్మా కంపెనీ షేర్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *