Oct 25 Gold Prices | పండగల వేళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుకు అనుకూల సమయమేనా?

మ్యూచువల్ ఫండ్ సంస్థలు అక్టోబర్ 16 నుంచి గోల్డ్ & సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF) పథకాల ద్వారా వచ్చే కొత్త పెట్టుబడుల స్వీకరణను తాత్కాలికంగా ఆపివేశాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 25 Gold Prices | పండగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బులియన్ మార్కెట్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు, మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాల ప్రభావంతో ఇటీవల బంగారం, వెండి Silver ధరల్లో సవరణలు (Correction) కనిపించాయి.

అంతర్జాతీయ పసిడి మార్కెట్‌లో నెలకొన్న హెచ్చుతగ్గుల కారణంగా ఈ వారం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,700 మేర తగ్గి రూ.1.45 లక్షల దిగువకు చేరగా, వెండి ధర కూడా కేజీకి రూ.2 లక్షల మార్కు వైపునకు దిగివచ్చింది.

Oct 25 Gold Prices | హైదరాబాద్‌లో నేటి ధరల వివరాలు

  • 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత): గ్రాముకు ₹14,258 (10 గ్రాములు ₹1,42,580)
  • 22 క్యారెట్ల ఆభరణాల బంగారం (91.6% స్వచ్ఛత): గ్రాముకు ₹13,070 (10 గ్రాములు ₹1,30,700)
  • 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత): గ్రాముకు ₹10,694 (10 గ్రాములు ₹1,06,940)

Oct 25 Gold Prices | ధంతేరస్, దీపావళి సెంటిమెంట్.. కొనుగోళ్లకు ఊపు?

ధన త్రయోదశి (ధంతేరస్), దీపావళి వేళ.. బంగారం, వెండి నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేయడం శుభసూచకంగా మనవాళ్లు భావిస్తారు. ప్రస్తుతం ధరల్లో దిద్దుబాటు నమోదు కావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరట కలిగించే అంశం. దీంతో పండగ రోజుల్లో జ్యువెలరీ షోరూములకు కస్టమర్ల రద్దీ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Oct 25 Gold Prices | బంగారంలో పెట్టుబడులు.. ఏ మార్గం శ్రేయస్కరం?

పసిడిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే వివిధ మార్గాల లాభనష్టాలను పరిశీలించడం అవసరం..

భౌతిక బంగారం (Physical Gold): నాణేలు, బిస్కెట్లు లేదా నగల రూపంలో కొనుగోలు చేయవచ్చు. అయితే దీనిపై 3% జీఎస్టీ (GST) కి అదనంగా ఆభరణాలైతే తయారీ ఛార్జీలు (Making Charges), తరుగు రూపంలో అదనపు వ్యయం అవుతుంది. తిరిగి విక్రయించేటప్పుడు ఈ అదనపు ఛార్జీలు తిరిగిరావు.

గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs): స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా నేరుగా పసిడి బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ఇవి బంగారం ధరలకు అనుగుణంగా ట్రేడ్ అవుతాయి. భౌతిక భద్రతతో పనిలేకుండా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది అనువైన మార్గం. (కాకపోతే డీమ్యాట్ ఖాతా, బ్రోకరేజీ ఛార్జీలు చెల్లించాలి).

సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBs): కేంద్ర ప్రభుత్వం కొత్త సిరీస్‌ల జారీని తాత్కాలికంగా ఆపినప్పటికీ, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇప్పటికే ఉన్న బాండ్లను ఇతర ఇన్వెస్టర్ల నుంచి ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కాకపోతే వాటి మెచ్యూరిటీ కాలం, వడ్డీ ప్రయోజనాలను సరి చూసుకోవాలి.

Oct 25 Gold Prices | గోల్డ్, సిల్వర్ FOFలలో కొత్త పెట్టుబడులకు బ్రేక్

పండగ డిమాండ్ పెరిగినప్పటికీ పెట్టుబడిదారులు ఒక నిబంధనను గమనించాలి. దేశంలోని ప్రధాన మ్యూచువల్ ఫండ్ సంస్థలు అక్టోబర్ 16 నుంచి గోల్డ్ & సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF) పథకాల ద్వారా వచ్చే కొత్త పెట్టుబడుల స్వీకరణను తాత్కాలికంగా ఆపివేశాయి.

అయితే, ఈ పరిమితి కేవలం ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఎక్స్ఛేంజీలలో నేరుగా ట్రేడ్ అయ్యే గోల్డ్ ఈటీఎఫ్‌లకు, ఇప్పటికే నడుస్తున్న ఎస్‌ఐపీ (SIP)లకు ఈ నిబంధన వల్ల ఎటువంటి ఆటంకం ఉండదు. కొత్తగా డిజిటల్, ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టేముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను లేదా పథక నిబంధనలను ఒకసారి సంప్రదించడం శ్రేయస్కరం.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *