L&T TuTr Hyperloop Partnership| హైపర్‌లోప్ టెక్నాలజీ కోసం ఎల్&టీ ఒప్పందం.. భారత్‌లో నెక్స్ట్-జెన్ రవాణా రంగానికి ఊతం

భారతదేశంలో తదుపరి తరం రవాణా సాంకేతికత , మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రముఖ నిర్మాణ రంగా దిగ్గజం 'లార్సెన్ అండ్ టూబ్రో' (L&T) కీలక ముందడుగు వేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: L&T TuTr Hyperloop Partnership | భారతదేశంలో  ( India ) తదుపరి తరం రవాణా సాంకేతికత , మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రముఖ నిర్మాణ రంగా దిగ్గజం ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (L&T) కీలక ముందడుగు వేసింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన డీప్‌టెక్ స్టార్టప్ ‘ట్యూటర్ హైపర్‌లోప్’ (TuTr Hyperloop) తో ఎల్&టీ అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

L&T TuTr Hyperloop Partnership | అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో..

ఎల్&టీ ఇంజనీరింగ్, కాంట్రాక్టింగ్ అనుభవానికి ట్యూటర్ హైపర్‌లోప్  స్వదేశీ విద్యుదయస్కాంత చోదక వ్యవస్థల నైపుణ్యాన్ని జోడించనున్నారు. లీనియర్ ఇండక్షన్ మోటార్ ప్రొపల్షన్, వ్యాక్యూమ్ ట్యూబ్ నెట్‌వర్క్, ప్రెజర్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్ మౌలిక వసతులు, సిగ్నలింగ్ , టెలికమ్యూనికేషన్ రంగాల్లో అవకాశాలను సంయుక్తంగా పరిశోధించనున్నారు.

L&T TuTr Hyperloop Partnership | లాజిస్టిక్స్ వృద్ధి..

ఈ భాగస్వామ్యం ద్వారా ప్రయాణికులనే కాకుండా పోర్ట్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ క్యారిడార్లు, సరుకు రవాణాలో విప్లవాత్మక మార్పులు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ శక్తి వినియోగం, తక్కువ ఉద్గారాలు , వేగవంతమైన ప్రయాణ సదుపాయం అందించడానికి హైపర్‌లోప్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని ప్రతినిధులు తెలిపారు.

L&T TuTr Hyperloop Partnership | స్వదేశీ ఆవిష్కరణల వాణిజ్యీకరణ..

ఐఐటీ మద్రాస్ స్టార్టప్‌గా ప్రారంభమైన ట్యూటర్ హైపర్‌లోప్, స్వదేశీ నైపుణ్యంతో మేగ్నెటిక్ లెవిటేషన్ , వ్యాక్యూమ్ ఆధారిత రవాణా దిశగా ప్రయాణిస్తోంది. విద్యాసంస్థలు, సాంకేతిక నిపుణులు , పారిశ్రామిక దిగ్గజాలు కలిసి పనిచేయడం ద్వారా భారతదేశంలో ఆధునిక రవాణా రంగాన్ని వాణిజ్యపరంగా అమలు చేయడం సులువవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *