అక్షరటుడే, వెబ్డెస్క్: Visakhapatnam Mayor Race | రాజకీయాలంటేనే వంశపారంపర్యం.. పదవులంటేనే కుటుంబ బంధాలు అన్నట్లుగా మారుతున్నాయి మన నేతల తీరు! ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి.
అందునా సిండికేట్ రాజకీయంలా మారిన విశాఖ మేయర్ పీఠంపై ఇప్పుడు ఒక సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. అదే.. నందమూరి వారి కుటుంబం నుంచి మరో ఇల్లాలి ఎంట్రీ!
Visakhapatnam Mayor Race | విశాఖ మేయర్ రేసులో తేజస్విని పేరు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ఇంకేముంది.. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, విశాఖ Visakhapatnam ఎంపీ భరత్ సతీమణి అయిన తేజస్విని పేరు ఇప్పుడు తెరపైకి తెచ్చి జోరుగా ప్రచారం చేస్తున్నారు!
నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, భర్త ఎంపీగా ఉండటంతో.. ఇక మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ఈ స్థానం నుంచి పక్కకు తప్పుకొంటాయా? లేక మేమూ పోటీలోనే ఉంటామని పట్టుబడతాయా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే జనసేన పార్టీ ఈ మేయర్ పదవిపై ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం!
Visakhapatnam Mayor Race | పదవుల ఆకలి…
ఇది నిజమో లేక కేవలం రాజకీయ లీకులో కానీ.. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో, ప్రజల నోట ఒకే ఒక్క ప్రశ్న ట్రెండ్ అవుతోంది. అదేమిటంటే..
- భర్త ఎంపీగా ఉన్నారు!
- తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు!
- మామ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు!
- బావ లోకేష్ మంత్రిగా ఉన్నారు!
ఇంతటి పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న వీరికి.. మళ్లీ ప్రత్యేకంగా మరో పదవి అవసరమా..? ప్రజలకు సేవ చేయడానికి పదవులు అవసరం లేదని చెప్పే నేతలు.. అందినకాడికి కుటుంబంలోని అందరికీ పదవులు కట్టబెట్టడమేనా అసలైన ప్రజాస్వామ్యం? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు!
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
రాజకీయాల్లోకి రావడం, ప్రజాసేవ చేయడం తప్పుకాదు. కానీ, అన్ని పదవులు ఒకే కుటుంబం చుట్టూ తిరగడం వల్ల కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. విశాఖ మేయర్ పీఠం ఎవరిని వరిస్తుంది? నందమూరి వారి ఎంట్రీతో ఉత్తరాంధ్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది? వేచి చూడాల్సిందే!