అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana CI Transfers | తెలంగాణ పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి మల్టీ జోన్-1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా కారణాలతో మొత్తం 14 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను (సీఐలు) వివిధ జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్టీ జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వుల ప్రకారం, కొందరికి ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్‌లు కల్పించగా, మరికొందరిని ఇతర అధికారుల స్థానాల్లో నియమించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్-1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Telangana CI Transfers | సీఐల బదిలీల వివరాలు
- మహమ్మద్ సాజిదుల్లాను ఆదిలాబాద్ జిల్లా డీటీసీ (DTC)లో ఖాళీగా ఉన్న పోస్టులో నియమించారు.
- పైండ్ల మల్లయ్యకు ఆసిఫాబాద్ జిల్లా డీసీఆర్బీ (DCRB)లో పోస్టింగ్ ఇచ్చారు.
- ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ పీసీఆర్ (PCR)లో పనిచేస్తున్న పంజాల మల్లేశ్ గౌడ్‌ను నిర్మల్ జిల్లా డీసీఆర్బీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో జిలెల్లమూడి మోహన్‌బాబును సిద్దిపేట కమిషనరేట్ పీసీఆర్‌లో నియమించారు.
- సుంకర శ్రీలతకు నిర్మల్ జిల్లా డీసీఆర్బీలో పోస్టింగ్ కల్పించారు.
- ముప్పారపు కరుణాకర్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీఆర్ (VR)కు బదిలీ చేశారు.
- సిద్దిపేట కమిషనరేట్ సీఎస్బీ (CSB)లో పనిచేస్తున్న బూర శ్రీధర్‌ను రామగుండం కమిషనరేట్ పీసీఆర్‌కు పంపించారు. ఆయన స్థానంలో ఎస్కే లతీఫ్‌ను సిద్దిపేట కమిషనరేట్ సీఎస్‌బీలో నియమించారు.
- రామగుండం కమిషనరేట్ సీఎస్‌బీలో పనిచేస్తున్న ఎంబాడి భీమేశ్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సర్కిల్‌కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఈవూరి నాగార్జునరావును మల్టీ జోన్-1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
- ఖమ్మం కమిషనరేట్ సీసీఆర్బీ (CCRB)లో పనిచేస్తున్న పంజర్ల సర్వయ్యను ఖమ్మం కమిషనరేట్‌లోని సత్తుపల్లి రూరల్ సర్కిల్‌కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న లక్ష్మీ ముత్తు లింగయ్యను మల్టీ జోన్-1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- బోడకుంట్ల రఘుపతికి నిజామాబాద్ కమిషనరేట్ సీఎస్‌బీలో పోస్టింగ్ ఇచ్చారు.
- రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని-1 టౌన్ పోలీస్ స్టేషన్లో రెండో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సయ్యద్ అఫ్జలుద్దీన్ను సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండో ఇన్స్పెక్టర్గా నియమించారు. అదనంగా ఆయనకు సిద్దిపేట కమిషనరేట్ సీఎస్బీ బాధ్యతలకు అటాచ్ చేశారు.
Telangana CI Transfers | రిలీవింగ్, రిపోర్టింగ్ వివరాలు పంపాలని ఆదేశం
బదిలీ అయిన ఇన్స్పెక్టర్లను విధుల నుంచి రిలీవ్ చేసిన తేదీ, కొత్త పోస్టింగ్‌లో రిపోర్ట్ చేసిన తేదీ వివరాలను సంబంధిత యూనిట్ అధికారులు మల్టీ జోన్-1 కార్యాలయానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..