Former CI Surrenders | అత్యాచారం కేసు.. లొంగిపోయిన మాజీ సీఐ

అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన మల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తనపై అత్యాచారం చేశాడని చినమల్లయ్యపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Former CI Surrenders | అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన మల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తనపై అత్యాచారం చేశాడని చినమల్లయ్యపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 29న పల్నాడు జిల్లా (Palnadu District) వినుకొండ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది.

కేసు నమోదు కాగానే చిన మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం యత్నించాడు. గత నెల 14న హైకోర్టు (High Court) ఆయన పిటిషన్​ను కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. అక్కడ సైతం ఎదురు దెబ్బ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం చినమల్లయ్యకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

Former CI Surrenders | ఉద్యోగంలో నుంచి తొలగింపు

Former CI Surrenders

ఓ వైపు అరెస్ట్ నుంచి రక్షణ లభించకపోగా.. సీఐ చినమల్లయ్య పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయనను ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ మేరకు ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దారులు మూసుకుపోవడంతో తన అరెస్ట్ తప్పదని భావించిన చిన మల్లయ్య శుక్రవారం రాత్రి వినుకొండ పోలీసులు ఎదుట సరెండర్​ అయ్యారు.

ఇది కూడా చదవండి..: ACB raids Kakinada | కాకినాడలో ఏసీబీ కలకలం: కోట్ల అక్రమాస్తులతో చిక్కిన రెవెన్యూ అధికారి శివరాం కుమార్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *