అక్షరటుడే వెబ్‌డెస్క్: Allu Sirish Noise Pollution | హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు, మైకులు వాడుతుండటంపై ప్రముఖ సినీ నటుడు అల్లు శిరీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ శబ్ద కాలుష్య సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసులను నేరుగా ట్యాగ్ చేశారు.
Allu Sirish Noise Pollution | అర్ధరాత్రి దాటినా ..
షేక్‌పేటలోని ‘అపర్ణా వన్’ గేటెడ్ సొసైటీలో నివసించే అల్లు శిరీష్.. తన ఇందుకు సమీపంలో ఉన్న వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి గత కొన్ని రోజులుగా భారీ శబ్దంతో సంగీతం, మైకులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మైకుల మోత ఆగడం లేదని తెలిపారు. ఈ తీవ్రమైన శబ్ద కాలుష్యం కారణంగా తమ అపార్ట్‌మెంట్‌లోని వృద్ధులు, చిన్నారులు, ఉదయం వేళల్లో ఉద్యోగాలకు వెళ్లే వారు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Allu Sirish Noise Pollution | పోలీసుల స్పందన..
ఈ సమస్యపై ఇదివరకే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ వెల్లడించారు. అయితే, గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు కాస్త సహకరించాలని ఆ సమయంలో పోలీసులు కోరినట్లు తెలిపారు. అయితే, సెప్టెంబర్ 25 గడువు ముగిసి నిమజ్జనాలు పూర్తయినా కూడా ఆలయం వద్ద లౌడ్‌స్పీకర్ల మోత మాత్రం తగ్గలేదని ఆయన వాపోయారు. గతంలోనూ స్థానికులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదని పేర్కొన్నారు. నిబంధనలను కఠినంగా అమలు చేసి, అర్ధరాత్రి వేళల్లో ప్రజలకు ప్రశాంతమైన నిద్ర లభించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
Allu Sirish Noise Pollution | వైరల్ అవుతున్న చర్చ..
అల్లు శిరీష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రాత్రి వేళల్లో ఇలాగే శబ్ద కాలుష్య సమస్య ఎక్కువగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లగించి రాత్రిపూట లౌడ్‌స్పీకర్లు వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Respected @hydcitypolice . I’m a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
— Allu Sirish (@AlluSirish) September 27, 2026
ఇది కూడా చదవండి: Esha Singh Silver Medal | షూటింగ్లో రజతం సాధించిన ఈషా సింగ్