అక్షరటుడే వెబ్‌డెస్క్: Burma Burma IPO | దేశంలోనే అతిపెద్ద స్పెషాలిటీ బర్మీస్ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ ( Restaurant )చెయిన్ అయిన “బర్మా బర్మా రెస్టారెంట్ & టీ రూమ్” (Burma Burma Restaurant & Tea Room) మాతృ సంస్థ ‘హంగర్ పాంగ్స్ లిమిటెడ్’ (Hunger Pangs Limited) క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) వద్ద తన డ్రాఫ్ట్ రెడ్ హేరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ను దాఖలు చేసింది. ప్రీమియం పాన్-ఏషియన్ క్యాజువల్ డైనింగ్ రంగంలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ, ఐపీఓ ద్వారా భారీగా నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతోంది.
Burma Burma IPO | ఐపీఓ హైలైట్స్ ..
ఈ పబ్లిక్ ఆఫర్ కింద రూ. 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లతో కూడిన రూ. 150 కోట్లను (రూ. 1,500 మిలియన్లు) తాజాగా జారీ చేయనున్నారు (Fresh Issue). దీనితో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు , ఇతర వాటాదారుల నుంచి మొత్తం 2,79,29,760 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు.
నిధుల వినియోగం: తాజా జారీ ద్వారా వచ్చే నిధులను భారతదేశంలో కొత్తగా ‘బర్మా బర్మా’ రెస్టారెంట్లను ఏర్పాటు చేయడానికి , సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వెచ్చిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూకి ‘లాంబాత్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సోల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.
Burma Burma IPO | వ్యాపార విస్తరణ ..
నెట్వర్క్: 2026 జూలై 31 నాటికి దేశవ్యాప్తంగా 9 నగరాల్లో 21 రెస్టారెంట్లు, 1 డెలివరీ కిచెన్ , 3 వేర్‌హౌస్‌లను కంపెనీ నిర్వహిస్తోంది. ప్రీమియం మాల్స్, హై-స్ట్రీట్ లొకేషన్లు, కార్పొరేట్ పార్కుల్లో వీటిని ఏర్పాటు చేశారు. 2026 జూన్ నాటికి ఈ రెస్టారెంట్లలో మొత్తం 1,991 సీటింగ్ సామర్థ్యం ఉంది.
ఆర్థిక వృద్ధి: హంగర్ పాంగ్స్ ఆర్థిక ఫలితాలు అత్యంత బలంగా ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 106.09 కోట్లుగా ఉన్న ఆపరేటింగ్ రెవెన్యూ.. 2026 ఆర్థిక నాటికి రూ. 155.49 కోట్లకు (46.56% వృద్ధి) పెరిగింది. అలాగే 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఈబిడా (EBITDA) రూ. 25.67 కోట్లుగా నమోదు కాగా, ఈబిడా మార్జిన్ 16.51% వద్ద ఉంది.
సగటు బిల్లు విలువ: 2026 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో కస్టమర్ సగటు బిల్లు విలువ రూ. 2,400గా నమోదైంది. డైనింగ్‌తో పాటు డెలివరీ వ్యాపారం ద్వారా కూడా కంపెనీ ఆదాయం వస్తోంది (2026 ఆర్థిక సంవత్సరంలో 10.76% వాటా). భవిష్యత్తులో రెస్టారెంట్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్, రెడీ-టు-ఈట్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Alumni Reunion | ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుక