అంతర్జాతీయంHormuz Strait Attack | హార్ముజ్ జలసంధి జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్ దాడులను...

Hormuz Strait Attack | హార్ముజ్ జలసంధి జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్ దాడులను తిప్పికొట్టామని ట్రంప్ వ్యాఖ్య

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Attack | హార్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలపై జరిగిన దాడులను తమ సైన్యం తిప్పికొట్టిందని Donald Trump వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్య అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.

Hormuz Strait Attack | ఇరాన్‌ పడవలు పూర్తిగా ధ్వంసం

ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన 3 అత్యాధునిక డిస్ట్రాయర్లు హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఇరాన్‌ దాడులను ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి జరిగిందని.. అయితే అమెరికా రక్షణ వ్యవస్థ వాటిని సమర్థంగా అడ్డుకుందని ట్రంప్​ పేర్కొన్నారు.

అమెరికా డిస్ట్రాయర్లకు ఎలాంటి నష్టం జరగలేదని, ప్రత్యుత్తర దాడుల్లో ఇరాన్‌ పడవలు పూర్తిగా ధ్వంసమైనట్లు ట్రంప్ వెల్లడించారు. డ్రోన్లను గాల్లోనే కూల్చివేశామని, దాడి చేసిన బోట్లు సముద్రంలో మునిగిపోయాయని చెప్పారు.

Hormuz Strait Attack | నాయకత్వం అత్యంత ప్రమాదకరంగా

ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన డోనాల్డ్​ ట్రంప్.. “ఇరాన్ సాధారణ దేశం కాదు. అక్కడి నాయకత్వం అత్యంత ప్రమాదకరంగా వ్యవహరిస్తోంది..” అంటూ తీవ్ర వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు సంపాదించే అవకాశాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అమెరికా యుద్ధ నౌకలు ప్రస్తుతం నౌకాదళ దిగ్బంధన చర్యల్లో తిరిగి చేరనున్నాయని ఆయన వెల్లడించారు. హార్ముజ్ జలసంధిలో తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Meena Driverless Taxi | డ్రైవర్ లేని కారులో నటి మీనా ప్రయాణం.. వీడియో వైరల్!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...