అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ali Khamenei Funeral 2 | ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనీ అంత్యక్రియలు ఆదివారం టెహ్రాన్‌లో భారీ జనసందోహం మధ్య కొనసాగాయి.
దేశ రాజధానిలో లక్షలాది మంది ప్రజలు హాజరై ఖామెనీకి తుది వీడ్కోలు పలికారు. రెండో రోజు అంత్యక్రియల కార్యక్రమంలో ఆయన పార్థివదేహానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
Ali Khamenei Funeral 2 | ఇంకా ఎందుకు బతికే ఉన్నాడు?
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవి మొహమ్మద్ రసూలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, “ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి ఇంకా ఎందుకు బతికే ఉన్నాడు?” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం సభలోని కొందరు “అమెరికా మృతి చెందాలి”, “ఇజ్రాయెల్ మృతి చెందాలి” అంటూ నినాదాలు చేశారు.
అంత్యక్రియల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్–ఖతార్ మధ్య సముద్ర వాణిజ్యం తిరిగి ప్రారంభమైనట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
కాగా, ఖామెనీ వారసత్వానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అంత్యక్రియల కార్యక్రమంలో కొత్త నాయకుడు కనిపించలేదని, ఖామెనీ కుమారుల్లో ఇతరులు మాత్రం నివాళులు అర్పించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.