Sunnam Cheruvu Illegal Borewells | సున్నం చెరువు పరిధిలో అక్రమ బోర్లపై హైడ్రా చర్యలు

హైదరాబాద్​ నగరంలోని మాదాపూర్​లో గల సున్నం చెరువులో అక్రమంగా వేసిన బోర్లు, పైప్​లైన్లను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sunnam Cheruvu Illegal Borewells | హైదరాబాద్​ నగరంలోని మాదాపూర్​లో గల సున్నం చెరువులో అక్రమంగా వేసిన బోర్లు, పైప్​లైన్లను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు. పోలీసు భద్రత నడుమ, రెవెన్యూ, సీఎంసీ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఆపరేషన్‌లో నివాస ప్రాంగణాల్లోని బోర్‌వెల్‌లకు అనుసంధానించిన పైపులను తొలగించింది.

హైదరాబాద్​ (Hyderabad)లో నీటి ఎద్దడి నెలకొన్న విషయం తెలిసిందే. ఏళ్లుగా మాదాపూర్​లోని సున్నం చెరువు కేంద్రంగా కొందరు అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. చెరువులో బోర్లు, పైప్​లైన్​లు వేసి.. ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. దీనిపై గతంలో పలుమార్లు హైడ్రా హెచ్చరించినా.. వ్యాపారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో హైడ్రా శనివారం ఆపరేషన్​ చేపట్టింది.

Sunnam Cheruvu Illegal Borewells | నివాసాల్లో నీటి వ్యాపారం

నివాస ప్రాంతాల నుంచి భూగర్భ జలాలను తోడి, విక్రయించడానికి వేసిన అక్రమ బోర్‌వెల్ పైప్‌లైన్‌లను తొలగించేందుకు హైడ్రా ఒక భారీ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇంట్లో బోరుబావి, పక్కనే నీళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సున్నం చెరువు పరిసరాల్లోని కొన్ని నివాసాల్లో అక్రమంగా నీటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. మురుగునీరు, చెత్తాచెదారం మీదుగా వేసిన పైపుల వల్ల తీవ్రమైన కాలుష్య ప్రమాదం ఉందని, చిన్న పగుళ్లు కూడా నీటి సరఫరాను కలుషితం చేయగలవని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ హెచ్చరించారు. ఆ పైప్​లైన్​లను ధ్వంసం చేశారు.

ఇది కూడా చదవండి..: TG Safe Raids | పండుగ వేళ స్వీట్లు కొంటున్నారా.. అయితే జాగ్రత్త!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *