అక్షరటుడే, వెబ్‌డెస్క్: Building Collapse | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది.
మాదాపూర్‌లోని అంజయ్యనగర్‌లో నాలాను ఆక్రమించి 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. పక్కన అపార్ట్‌మెంట్‌పై భవనం కూలడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికి తీశారు.
Building Collapse | అక్రమ నిర్మాణం
తక్కువ స్థలంలో, నాలాను ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో కూలినట్లు తెలుస్తోంది. 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించడానికి వీలు లేదు. నిర్మించినా.. కింద సపోర్టు లేక కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అయినా కూడా యజమాని, బిల్డర్ అత్యాశతో నిర్మాణం చేపట్టారు. దీంతో అది కూలిపోయింది. భవనం కూలడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ సైతం స్వల్పంగా ధ్వంసమైంది. అందులో ఉన్న పలువురికి గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి..: Lingamneni Sanjush | రోడ్డు ప్రమాదంలో యువతి మృతి కేసు.. డ్రగ్స్, మద్యం పరీక్షల్లో ఎంపీ కుమారుడికి నెగెటివ్