Adilabad Boy Death | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. చింతగింజలు గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి

చింతగింజలు తింటుండగా.. ప్రమాదవశాత్తు అవి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, నెట్​వర్క్​: Adilabad Boy Death | చింతగింజలు తింటుండగా.. ప్రమాదవశాత్తు అవి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Adilabad Boy Death | ఊపిరాడక..విలవిల్లాడి..

ఆదిలాబాద్‌ (Adilabad)కు చెందిన మంకేష్‌ (9)కు చింతగింజలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది. శనివారం చింతగింజలు తింటుండగా ఒక్కసారిగా అవి గొంతులో ఇరుక్కుపోవడంతో బాలుడికి ఊపిరి ఆడలేదు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ బాలుడు మృతి చెందినట్లు సమాచారం. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు ఆహారం లేదా గింజలు తినే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Jupalli Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం : మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *