అక్షరటుడే, వెబ్‌డెస్క్: Secret Treasure Fraud | గుప్త నిధుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
రాజేంద్రనగర్ పోలీసుల (Rajendra Nagar Police) సహకారంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కార్లు, ఒక ఆటో, రెండు బైక్‌లు. 4 సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత నాణేలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29) ఉన్నారు. ప్రధాన నిందితుడు మునావర్‌పై గతంలో బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఒక చీటింగ్ కేసు నమోదైంది.
Secret Treasure Fraud | రూ.కోటి వసూలు
తనకు గుప్త నిధులు వెలికితీసే విద్య తెలుసని మునావర్ ప్రజలను నమ్మించేవాడు. అనంతరం వారి ఇళ్లలో ముందుగా గుంత తీసి, అందులో బొగ్గు నకిలీ బంగారు నాణేల సంచిని రహస్యంగా ఉంచేవారు. అనంతరం పూజలు నిర్వహించి, బొగ్గు బంగారంగా మారేందుకు సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఇలా చేసినందుకు వారి నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. 11 మందిని మోసం చేసి వారి నుంచి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : Future City Land Allegations | ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దోపిడీ : మన్నె క్రిశాంక్