Future City Land Allegations | ఫ్యూచర్‌ సిటీ పేరుతో భూ దోపిడీ : మన్నె క్రిశాంక్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Future City Land Allegations | ఫ్యూచర్‌ సిటీ పేరుతో కాంగ్రెస్​ ప్రభుత్వం భూ దోపిడీకి పాల్పడుతోందని బీఆర్​ఎస్​ (BRS) నాయకుడు మన్నె క్రిశాంక్​ ఆరోపించారు. తెలంగాణ భవన్​లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నల్లధనాన్ని విదేశాలకు తరలించే కుట్ర జరుగుతోందన్నారు. షెల్ కంపెనీ పేరుతో భూములు కేటాయించుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై క్రిశాంక్​ ఆరోపణలు చేశారు. ఈ కంపెనీ కేవలం రూ.లక్షతో మొదలైందన్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని, కానీ ఎలాంటి లైసెన్స్​లు లేవన్నారు. ఈ కంపెనీ ఏమీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోయినా రూ. కోటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ వచ్చాయని ఆరోపించారు. ఇందులో ఒక్క ఉద్యోగి కూడా లేరని, పటాన్‌చెరువులోని ఇంట్లో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

Future City Land Allegations | రేవంత్​రెడ్డి రాజీనామా చేయాలి

రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని రూ.7 కోట్లకు ఇచ్చారని మన్నె క్రిశాంక్​ ఆరోపించారు. భూముల కేటాయింపుపై విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. అక్రమాలకు పాల్పడిన సీఎం రేవంత్​రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు.

దీనిని కూడా చదవండి : Jharkhand Assembly Protest | విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి.. జార్ఖండ్​లో ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *