SIR Notices | సర్ నోటీసులపై కంగారుపడొద్దు : మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి

ఓటరు జాబితాలో పొరపాట్లను సరిసిద్ధేందుకు సర్ నోటీసులు జారీ చేస్తున్నారని, వాటిపై ఎవరు ఆందోళన చెందవద్దని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: SIR Notices | ఓటరు జాబితాలో పొరపాట్లను సరి సిద్ధేందుకు సర్ నోటీసులు జారీ చేస్తున్నారని, వాటిపై ఎవరు ఆందోళన చెందవద్దని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి (Municipal Chairperson Ippa Umarani) అన్నారు. మంగళవారం ఆమె జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ నోటీసుల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు.

SIR Notices | చిన్నపాటి పొరపాట్లు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002 నాటి ఓటర్ లిస్టుతో ప్రస్తుత ఓటర్ లిస్టు సరిపోలకపోవడం వల్ల చాలా మందికి నోటీసులు వస్తున్నాయనన్నారు. చిన్నపాటి పొరపాట్లు, అక్షర దోషాలు ఉన్నా సరే నోటీసులు జారీ చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఎవరూ కంగారు పడవద్దని, తగిన ఆధారాలు చూపించి బీఎల్​వోలకు సహకరించి ఓటరు నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. అధికారులు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు అంజాద్, నాయకులు కాళ్ల గణేష్, రామ్మోహన్, కో-ఆప్షన్ సభ్యుడు ముబాషీర్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Vemula Prashanth Reddy | కవిత ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా..: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *