Desk Journalists | ‘డెస్క్‌ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలి’

shashi kiran Mottala
Desk Journalists | డెస్క్‌ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలి

అక్షరటుడే, ఇందూరు: Desk Journalists | డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని డెస్క్‌ జర్నలిస్టుల యూనియన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో (Prajavani) వినతిపత్రం సమర్పించారు.

Desk Journalists | జీవో ప్రకారం అర్హులందరికీ..

ఈ సందర్భంగా డెస్క్‌ జర్నలిస్టులు మాట్లాడుతూ.. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన చాలా మంది డెస్క్‌ జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశాలున్నాయన్నారు. ఇటీవల జారీ చేసిన జీవోకు సవరణలు చేసి డెస్క్‌ జర్నలిస్టులందరికీ ఎడిషన్‌ కేంద్రంలోనే అక్రెడిటేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో సాక్షి నిజామాబాద్‌ (Nizamabad) బ్యూరో ప్రతినిధి భద్రారెడ్డి, సాక్షి టీవీ (Sakshi TV) కరస్పాండెంట్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డెస్క్‌ జర్నలిస్టులు భీంరావు, వెంకటరమణ, మహేశ్‌, స్వామి, రాకేశ్‌, నర్సింగ్‌రావు, సంతోష్‌, జర్నలిస్టులు రాజ్‌కుమార్‌, పబ్బ భూమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

desk

ఇది కూడా చదవండి:KCR Jagtial Meeting | నువ్వు వెయ్యి జన్మలు ఎత్తిన చావను.. కేసీఆర్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *