Constable Suicide | డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

డీజీపీ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Constable Suicide | డీజీపీ కార్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

డీజీపీ కార్యాలయం (DGP Office)లో స్వామి అనే కానిస్టేబుల్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆయన వాష్​రూమ్​కు వెళ్లాడు. అక్కడ తన సర్వీస్​ రివాల్వర్​తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్దం వినిపించడంతో పోలీసులు వెళ్లి చూడగా.. అప్పటికే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Constable Suicide | వాళ్లు మంచివారు

స్వామి మృతదేహం వద్ద పోలీసులకు సూసైడ్​ నోట్​ లభించింది. అందులో తన భార్య పిల్లలు మంచివాళ్లని, వారిని ఏమి అనవద్దని రాశాడు. తాను దెయ్యం అయి అయినా వారిని చూసుకుంటానని ఓ నోట్ బుక్​లో రాసి స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలు, ఉద్యోగ సంబంధ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: HYDRAA Lakes | చెరువులు సిద్ధం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *