Telangana Rain Forecast | రైతులకు అలర్ట్.. తగ్గనున్న వర్షాలు

రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Forecast | రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ చిరు జల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొన్నారు.

తెలంగాణ (Telangana)లో ఆరు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అన్ని ప్రాంతాల్లో తేలికపాటి భారీ వర్షాలు పడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చ చేశారు. వానాకాలం ప్రారంభం అయిన తర్వాత తొలిసారి ఈ స్థాయిలో వర్షాలు పడ్డాయి. అయితే వర్షాలకు రానున్న మూడు రోజులు విరామం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వాతావారణం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అయితే జులై 25 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

Telangana Rain Forecast | పంటల విషయంలో జాగ్రత్త

ఇన్ని రోజులు వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో పంటలు సాగు పూర్తిస్థాయిలో సాగలేదు. చాలా మంది రైతులు వరినాట్లు వేయలేదు. నీరు లేదని ఆలోచించారు. అయితే ఆరు రోజులు పాటు కురిసిన వర్షాలతో రైతులకు కొత్త ఊపిరి వచ్చింది. కాలం పోతుందని అనుకునే సమయంలో వానలు పడటంతో రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. జోరుగా వరినాట్లు వేస్తున్నారు. అయితే ఎల్​నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు తక్కువగా ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. వరి కాకుండా.. ఆరు తడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. వానాకాలం మొదలై 50 రోజులు దాటిపోయింది. అయినా చెరువులు, జలాశయాల్లోకి నీరు రాలేదు. దీంతో రైతులు పంటల సాగు విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: REDCO DE Assets | రెడ్​కో డీఈ అక్రమాస్తులు రూ.వందల కోట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *