జాతీయంRahul Gandhi | మోదీకి దేశాన్ని నడపడం చేతకాదు.. రాహుల్​ గాంధీ విమర్శలు

Rahul Gandhi | మోదీకి దేశాన్ని నడపడం చేతకాదు.. రాహుల్​ గాంధీ విమర్శలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ​రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఆయనకు దేశాన్ని నడపడం చేతకాదన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కాంప్రమైజ్​డ్​ అయిన ప్రధానికి దేశాన్ని నడపడం ఇక సాధ్యం కాదన్నారు.

ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్​ (Hyderabad) పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. పరేడ్​ గ్రౌండ్స్​లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయొద్దని ప్రజలను కోరారు. విదేశీ టూర్లకు వెళ్లొద్దని, పెట్రోల్​, డీజిల్​, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. విద్యుత్​ వాహనాలను వాడాలని, మెట్రోల్లో ప్రయాణించాలని సూచించారు. దీనిపై తాజాగా రాహుల్ గాంధీ ఎక్స్​ వేదికగా స్పందించారు.

Rahul Gandhi | వైఫల్యానికి నిదర్శనం

మోదీ చెప్పిన మాటలు ప్రబోధాలు కావని, వైఫల్యానికి నిదర్శనమని రాహుల్​ గాంధీ అన్నారు. ‘‘12 ఏళ్లలో ఆయన దేశాన్ని ఎంతటి దుస్థితికి తెచ్చారంటే – ఏమి కొనాలి, ఏమి కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అని ప్రజలకు చెప్పాల్సి వస్తోంది. ప్రతిసారీ, వారు తమ జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి బాధ్యతను ప్రజలపైకి నెట్టేస్తున్నారు’’ అని విమర్శించారు.

Rahul Gandhi | ప్రజల్లో ఆందోళన

విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని మోదీ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనని చర్చించుకుంటున్నారు. పెట్రోల్​, డీజిల్​ రేట్లు పెరుగుతాయెమోనని భయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Work From Home | దేశ ప్రయోజనాల కోసం మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి రావాలి : ప్రధాని Modi పిలుపు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Transgender Protest | కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్ల ధర్నా.. గ్రామాల్లోకి రావొద్దంటూ వీడీసీల హుకూంపై ఆగ్రహం..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Transgender Protest |నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు...

Himanta Biswa Sharma | అస్సాం సీఎంగా రేపు హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Himanta Biswa Sharma | అస్సాం ముఖ్యమంత్రిగా...

Stock Market Crash | ఆర్థిక సంక్షోభ భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో మళ్లీ...

AIADMK Factionalism | అన్నాడీఎంకేలో ముసలం.. ఓటమి తర్వాత ఈపీఎస్ vs షణ్ముగం వర్గాల ఆధిపత్య పోరు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIADMK Factionalism | తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు...