Yellareddy Municipal Meeting | ఎల్లారెడ్డి మున్సిపల్ సమావేశంలో అభివృద్ధి పనులకు ఆమోదం

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipal Meeting | పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో (Yellareddy Municipality) శుక్రవారం ఛైర్మన్ శ్రీకాంత్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు కీలక అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు.

Yellareddy Municipal Meeting | వార్డుల్లో నీటి ఎద్దడి నివారణకు..

పురపాలక సంఘ పరిధిలోని అన్ని వార్డులలో (Water Supply Projects) నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు కొత్త బోరు మోటార్ల కొనుగోలు కోసం రూ. 20 లక్షల నిధులను కేటాయించారు. వీధి దీపాల సమస్య పరిష్కారం కోసం 36వాట్స్​, 50వాట్స్​, 100వాట్స్​ సామర్థ్యంతో హైమాస్ట్​ లైట్ల కొనుగోలుకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. అలాగే పలు వార్డుల్లో కల్వర్టులు, చిన్న మురికి కాలువల నిర్మాణం కోసం మరో రూ.10 లక్షలను ఆమోదించారు.

Yellareddy Municipal Meeting | పారిశుధ్య సిబ్బంది సంక్షేమం దృష్ట్యా..

పారిశుధ్య సిబ్బంది(Sanitation Workers) సంక్షేమం దృష్ట్యా వారికి నెలసరి సబ్బులు, ఇతర అవసరమైన వస్తువులను అందించడంతో పాటు కార్యాలయ సిబ్బంది అందరికీ రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని తీర్మానించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలు దోమల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల అవసరాల నిమిత్తం బాడీ ఫ్రీజర్‌ను కొనుగోలు చేయడానికి, పట్టణంలో కోతులు, పందులు, కుక్కల బెడదను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో వైస్​ఛైర్మన్​ భాగ్యమ్మ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ జీవన్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *