అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TRSMA Nizamabad | నల్గొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిసున్నామని ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం అన్నారు. సోమవారం నగరంలో(Nizamabad) ట్రస్మా ఆధ్వర్యంలో కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.
TRSMA Nizamabad | ఉపాధ్యాయుల భద్రతకు చర్యలు తీసుకోవాలి
నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల (Private School Teachers)యాజమాన్యాల ఉపాధ్యాయుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీ సాయి చైతన్యకు మెమోరాండం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన విద్యా రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యాసంస్థలను నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా పాఠశాల నిర్వాహకురాలు ఇలాంటి దారుణ ఘటనకు గురికావడం అత్యంత బాధాకరమని తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు.
TRSMA Nizamabad | భవిష్యత్తు తీర్చిదిద్దే వారిపైనే..
పాఠశాల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ప్రతిరోజు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని జయసింహ గౌడ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం వల్ల విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ట్రస్మా తరపున కొన్ని డిమాండ్లను సీపీ దృష్టికి తీసుకువస్తున్నామన్నారు. రూపారెడ్డి హత్య కేసును అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేసి, నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రస్మా జిల్లా సెక్రెటరీ అరుణ్, జిల్లా కోశాధికారి ఉప్పల మధు, నరసింహారావు, మోహన్, జనార్ధన్, పృథ్వీ, పాఠశాల శ్రీనివాస్, నాగరాజు, రమేష్, ప్రభాదేవి, కవితా, ధర్మరాజు, రమేష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: స్మార్ట్ మీటర్లతో పేదలపై భారం