TOSS Exams Security | ఓపెన్​ స్కూల్​సొసైటీ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఓపెన్​ స్కూల్​ సొసైటీ ఆధ్వర్యంలో జరుగనున్న పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని సీపీ సాయిచైతన్య తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం:  TOSS Exams Security | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఓపెన్​ స్కూల్​ సొసైటీ ఆధ్వర్యంలో జరుగనున్న పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

TOSS Exams Security | 163 బీఎన్​ఎస్​ఎస్​ అమలు..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) పరీక్షకు సంబంధించి ఎస్సెస్సీ పరీక్ష ఆదర్శ హిందీ విద్యాలయం హైస్కూలో ఉంటుందన్నారు. అలాగే ఇంటర్​ పరీక్ష ఆదర్శ హిందీ విద్యాలయం ఇంగ్లిష్ మీడియం హైస్కూల్​లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12:00 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఉంటుందని వివరించారు. ఈ పరీక్షలకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్​ఎస్​ఎస్​ అమలులో ఉంటుందని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: School Inspection | కస్తూర్బాను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *