అక్షరటుడే, వెబ్‌డెస్క్: HMDA E-Auction | హైదరాబాద్ Hyderabad మహా నగరంలో ప్రీమియం భూముల ఈ-వేలానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) సన్నాహాలు ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా టీ-హబ్‌లో HMDA ఆధ్వర్యంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. నియోపోలీస్, గోల్డెన్‌మైల్, సరూర్‌నగర్ ప్రాంతాల్లోని భూముల ఈ-వేలానికి సంబంధించి ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ప్రీ-బిడ్ సమావేశానికి ప్రముఖ డెవలపర్లు, రియల్‌ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ-వేలం ప్రక్రియ, భూముల వివరాలు, బిడ్డింగ్‌కు సంబంధించిన అంశాలపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు.
HMDA E-Auction | 7న సరూర్‌నగర్ భూముల వేలం
సరూర్‌నగర్‌లోని 4,356 చదరపు గజాల లేఅవుట్‌ను సెప్టెంబర్ 7న ఈ-వేలం వేయనున్నారు. ఈ స్థలంపై ఆసక్తి ఉన్న డెవలపర్లు, పెట్టుబడిదారులు వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది.
HMDA E-Auction | 9న నియోపోలీస్, గోల్డెన్‌మైల్
నియోపోలీస్, గోల్డెన్‌మైల్ లేఅవుట్‌లకు సెప్టెంబర్ 9న ఈ-వేలం నిర్వహించనున్నారు. నియోపోలీస్‌లో 4.59 ఎకరాలు, గోల్డెన్‌మైల్‌లో 0.70 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించేందుకు HMDA ఏర్పాట్లు చేస్తోంది.
నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రీమియం భూములకు మంచి స్పందన వస్తుందని HMDA అధికారులు భావిస్తున్నారు. ప్రీ-బిడ్ సమావేశానికి డెవలపర్లు, రియల్‌ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులు హాజరుకావడంతో రాబోయే ఈ-వేలంపై ఆసక్తి నెలకొంది.