SI Transfers | కమిషనరేట్​లో భారీగా ఎస్సైల బదిలీలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: SI Transfers | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో 20 మంది సబ్​ ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కీలక పోస్టింగ్​లో ఉన్న వారిని తప్పించి లూప్​లైన్​కు బదిలీ చేశారు. అలాగే లూప్​లైన్​, ఎస్సై–2లుగా కొనసాగుతున్న వారికి ఎస్​హెచ్​వోలుగా బాధ్యతలు కట్టబెట్టారు.

SI Transfers | బదిలీ అయిన ఎస్సైలు వీరే..

ఇందల్వాయి ఎస్సై సందీప్​ను ధర్పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. ధర్పల్లి ఎస్సై సామ శ్రీనివాస్​ను వీఆర్​కు అటాచ్​ చేశారు. వీఆర్​లో ఉన్న సుమలతకు ఇందల్వాయి ఎస్​హెచ్​వో బాధ్యతలు అప్పగించారు. కమ్మర్​పల్లి ఎస్సై అనిల్​ రెడ్డిని మాక్లూర్​కు బదిలీ చేశారు. మాక్లూర్​లో కొనసాగుతున్న ఎస్సై రాజశేఖర్​ను బోధన్​ రూరల్​ పీఎస్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. బోధన్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​లో ఉన్న మచ్చేందర్​ను ఎస్​బీకి అటాచ్​ చేశారు. అలాగే వెయిటింగ్​లో ఉన్న శ్రీనివాస్​ను కోటగిరి ఎస్సైగా నియమించారు. కోటగిరిలో ఉన్న సునీల్​ను ఐదో టౌన్​ ఎస్సై–1గా పంపించారు.

వీఆర్​లో వినయ్​ను నందిపేట ఎస్​హెచ్​వోగా బదిలీ చేశారు. ప్రస్తుతం నందిపేట ఎస్​హెచ్​వోగా ఉన్న శ్యాంరాజ్​ను వీఆర్​కు అటాచ్​ చేశారు. జగిత్యాల ఎస్​బీలో ఉన్న సతీశ్​ను కమ్మర్​పల్లి ఎస్​హెచ్​వోగా నియమించారు. వీఆర్​లో ఉన్న మనోజ్​ కుమార్​ను రుద్రూర్​ ఎస్సైగా బదిలీ చేశారు. రుద్రూర్​లో ఉన్న సాయన్నను వీఆర్​కు పంపించారు. ఐదో టౌన్​ ఎస్సై–1 గంగాధర్​ను రెంజల్​ పీఎస్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. వీఆర్​లో యాదగిరిని ఆరో టౌన్​ ఎస్సైగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న వెంకట్​ రావును సీటీసీ పంపించారు. వీఆర్​లో ఉన్న సందీప్​ను టూటౌన్​ ఎస్సై–1గా నియమించారు. రెండో టౌన్​లో ఉన్న సయ్యద్​ ముజాహిద్​ను ఎస్​బీకి బదిలీ చేశారు. సీసీఎస్​లో ఉన్న చంద్రమోహన్​ను సీసీఆర్​బీకి పంపించారు. వీఆర్​లో ఉన్న టి.గోవింద్​ను సీఎస్​బీకి బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి..: GGH Plastic Surgery | నిజామాబాద్​ జీజీహెచ్​లో తొలి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *